హైదరాబాద్ : ప్రభాస్, అనుష్క, రీచా గంగోపాధ్యాయ్ కాంబినేషన్లో కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'వారధి'. వారధి అనేది కేవలం వర్కింగ్ టైటిల్ మాత్రమే. తాజాగా ఈచిత్రానికి ‘తడాఖా' పేరును పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. దర్శక నిర్మాతలు ఓ నిర్ణయానికి వచ్చిన తర్వాత దీనిపై అధికారిక సమాచారం వెలువడే అవకాశం ఉంది.
దాదాపు తొంభై శాంతం షూటింగ్ పూర్తైన ఈ చిత్రం యాక్షన్ ఎంటర్టైనర్ ప్రేక్షకులను అలరిస్తుందని చెప్తున్నారు. మనసు, అద్దం రెండూ ఒక్కటే. ఒక్కసారి ముక్కలైపోతే మళ్లీ అతుక్కోవు. కానీ అలాంటి మనసులకూ మరమ్మత్తులు చేశాడో యువకుడు అనే కాన్సెప్టుతో ఈచిత్రాన్ని రూపొందిస్తున్నారు. యు.వి.క్రియేషన్స్ సంస్ద ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. వి.వంశీకృష్ణ, ప్రమోద్ నిర్మాతలు.
ఈచిత్రాన్ని సంక్రాంతి నాటికి ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఇటు కుటుంబ ప్రేక్షకుల్నీ అటు మాస్‌నీ సమంగా మెప్పించే కథ ఇది. అనుబంధాలు, ఆప్యాయతలూ మేళవింపుగా ఉంటుంది. స్వచ్ఛమైన స్నేహానికీ, ప్రేమకీ వారధిగా నిలిచిన ఓ యువకుడిగా హీరో పాత్ర ఉంటుందని ద్శకుడు తెలిపారు.
ఇక ప్రభాస్, తమన్నా, దీక్షాసేథ్ హీరో హీరోయిన్లుగా రాఘవ లారెన్స్ దర్శకత్వంలో రూపొందిన ‘రెబల్' చిత్రం సెప్టెంబర్ 28న విడుదలకు సిద్ధం అవుతోంది. మాస్ మసాలా ఎంటర్ టైనర్‌గా ఈచిత్రాన్ని తెరకెక్కించారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్స్ సినిమాపై అంచనాలు పెంచాయి.
0 comments:
Post a Comment